యర్రగొండపాలెం: డిప్యూటీ సీఎం కోరుకోవాలని త్రిపురాంతకం ఉమ్మడి ఆలయాలలో ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని త్రిపురాంతకం ఉమ్మడి ఆలయాలలో జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. వారు మాట్లాడుతూ... డిప్యూటీ సీఎం శనివారం శస్త్ర చికిత్స చేయించుకున్న సందర్భంగా త్రిపురాంతకేశ్వర స్వామి, బాలత్రిపుర సుందరి దేవి ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు