మదనపల్లి లో గోవదను అడ్డుకుంటే విహెచ్పి, బిజెపి, గో సంరక్షణ నేతలపై కేసులు పెడతారా..? బీజేపీ నేత బండి ఆనంద్ ప్రశ్నించారు
గోవధను అడ్డుకుంటే మాపైనే కేసులు పెడతారా :బిజెపి అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆరోగ్యవరం వద్ద ఆదివారం విచ్చలవిడిగా జరుగుతున్న గోవధను అడ్డుకుంటే తమపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రశ్నించడానికి వెళితే పోలీసులే రుబాబు చేస్తున్నారని బీజేపీ నేత బండి ఆనంద్ ఆరోపించారు. ఎలాంటి అనుమతి లేకుండా, ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కి వందలాది గోవులను క్రూరంగా వధించిన వారిని వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు చట్టాలను కాపాడాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. పీస్ కమిటీలో అధికారులు చేసిన హెచ్చరికలు ఏమయ్యాయని కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎస్పీ డిఎస్పీ లను ప్రశ్నించారు....