రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం ఉదయం కలకడ మండలం, ఏనుగొండపాలెం లో జరిగింది
రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమారుడికి తీవ్ర గాయాలు రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకు తీవ్రంగా గాయపడి మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఉదయం వెలుగుచూసిన ఘటనపై ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసుల కథనం.. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలకడ మండలం, యెనుగొండపాళ్యం గ్రామం, అవలప్పగారిపల్లెకు చెందిన కృష్ణప్ప కుమారున్ని వెంట బెట్టుకొని బైకులో చీకిచెట్టుపల్లికి వెళ్ళాడు. పని ముగించుకుని ఇంటికి వస్తుండగా, కుక్క అడ్డొచ్చి బైక్ లోనుంచి పడి తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను మదనపల్లికి తరలించారు