మదనపల్లి మండలంలోని వలసపల్లె పంచాయతీ నవోదయ కాలనీలో పాము కాటుకు గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి
పాము కాటుకు గురైన మహిళ మృతి పాము కాటేసి తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ ఆదివారం మృతి చెందింది. అన్నమయ్య జిల్లా, మదనపల్లి మండలం, వలసపల్లె పంచాయతీ, నవోదయ కాలనీలో కాపురం ఉంటున్న గంగాధర భార్య రోజా (25) స్థానిక బోయకొండ ఆర్చి వద్ద హోటల్ నిర్వహిస్తోంది. రాత్రి ఇంటి వద్ద బట్టలు ఉతుకు తుండగా విష సర్పం కాటేసి, రోజా తీవ్ర అస్వస్థతకు గురైంది. స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది