గిద్దలూరు: పాత సింగరాయకొండలో బావిలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి, దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి స్థానికంగా ఉన్న బావిలో పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియవలసి ఉందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కొరకు మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.