తాడిపత్రి: ఫ్లెక్సీలను చించివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తాడిపత్రి పోలీసులకు ఎమ్మార్పీఎస్ నాయకులు ఫిర్యాదు
తాడిపత్రి పట్టణంలోని పలు ప్రాంతాల్లో అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని అయితే ఆ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారని ఎమ్మార్పీఎస్ నాయకులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్పీఎస్ నియోజకవర్గం నాయకులు పెద్ద పుల్లయ్య, రాజారత్నం, బాబయ్య తదితరులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐ గౌస్ భాషా కు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేవేయడం అంటే అంబేద్కర్ను, మాదిగలను అవమానపరచడమేనన్నారు. వెంటనే ఫ్లెక్సీలు చించి వేసిన వారిని గుర్తించి కేసులు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు