గిద్దలూరు: రాచర్ల పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందికి ఎస్సై కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం రాచర్లలోని పోలీస్ స్టేషన్లో బుధవారం పోలీసు సిబ్బందికి ఎస్సై కోటేశ్వరరావు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆకవీడు ప్రాథమిక వైద్య చాలా వైద్యులు వారికి ఆరోగ్య సలహాలతో పాటు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మందులను అందజేశారు. వేసవికాలంతో పాటు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్పి ఆదేశాలతో వైద్య పరీక్షలు చేయించినట్లు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.