ఉరవకొండ: ప్రజా సేవలో, గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమైంది: ఉరవకొండలో వైసీపీ సమన్వయకర్త విశ్వేశ్వర్ రెడ్డి
ప్రజాసేవ లో, గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర చాలా కీలకమైందని ఉరవకొండ వైసీపీ సమన్వయకర్తను వై విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఉరవకొండలోని వైసీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన ఇటీవల పదవీ కాలం ముగించుకున్న తాజా మాజీ సర్పంచులను ఘనంగా సన్మానించారు. సర్పంచుల కృషి వల్లే గ్రామాల అభివృద్ధి చెందాయన్నారు. చాలామంది సర్పంచులు ప్రజాసేవకే అంకితమయ్యారన్నారు.