మార్కాపురం: ప్రమాదాల నివారణకు మార్కాపురం జిల్లా పరిసర ప్రాంతాలలో వాహనాలకు ఎల్ఈడీ లైట్లు తొలగించిన పోలీసులు
మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు నడుం బిగించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఆటోలతో పాటు ఇతర వాహనాలకు అన్నదికారకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లు పోలీసులు తొలగించారు. ఎదురుగా వస్తున్న వాహనదారులకు రహదారి కనిపించక ఎల్ఈడీ లైట్లు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అందుకే ఈ లైట్లు తొలగిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు