యర్రగొండపాలెం: చిన్న పిఆర్సి తండా గిరిజనులకు నివాస గృహాలను మందులు చేయాలని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం చిన్న పిఆర్సి తాండ గిరిజనులకు నివాస గృహాలను ఏర్పాటు చేయాలని సిపిఎం నాయకులు జిల్లా కలెక్టర్ విజయ సునీతకు విజ్ఞప్తి చేశారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. 70 సంవత్సరాలుగా 200 మంది నివాసం ఉంటున్న గిరిజనులకు నివాస గృహాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని సిపిఎం నాయకులు కలెక్టర్ ను కోరారు