గిద్దలూరు: కాపులపై వైసీపీ నాయకులు కపట ప్రేమ ఆపండి: ప్రకాశం జిల్లా మాజీ జనసేన కార్యదర్శి లంకా నరసింహారావు
కాపులపై వైసిపి నాయకులు కపట ప్రేమ ఆపాలని జనసేన ప్రకాశం జిల్లా మాజీ కార్యదర్శి లంక నరసింహారావు అన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన సాయి కృష్ణ ఘటనను వైసిపి రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు. గతంలో గిద్దలూరు నియోజకవర్గంలో వెంగయ్య నాయుడు మృతికి ఎమ్మెల్యే అన్నా రాంబాబు కారణం కాలేదా అని ప్రశ్నించారు. అంతేకాకుండా తనను కూడా ఆర్థికంగా దెబ్బతీశాడని విమర్శించారు. అంబటి రాంబాబు, పేర్ని నాని ఏ విధంగా పవన్ కళ్యాణ్ ని దూషించారో అందరు చూశారని ఎద్దేవా చేశారు.