రాయదుర్గం: RTC లో ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రజా రవాణా ప్రైవేటుపరం : ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ అధ్యక్షులు పిఎస్ ఖాన్
ఆర్టీసిలో ప్రైవేటు భాగస్వామ్యం ఎక్కువై ప్రజారవాణా ప్రైవేటీకరణ అవుతోందని ఏపిపిటిడి ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ అధ్యక్షులు పిఎస్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్ పిలుపులో బాగంగా రాయదుర్గం డిపో వద్ద ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి శనివారం నిరసన తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసి డ్రైవర్ కండక్టర్ లతోనే నడపాలని, ప్రైవేటు వారికి అప్పగించవద్దని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యానికి తమ డిమాండ్లను తెలియజేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.