కొండపి: సింగరాయకొండ లో వేసవి సమ్మర్ క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించిన స్థానిక సీఐ శ్రీహరి, క్రీడాకారులకు సూచనలు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ ను సిఐ శ్రీహరి ప్రారంభించారు. కల్లకుంట్ల గోపి మెమోరియల్ వారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. పోటీలలో విజయం సాధించే మొదటి జట్టుకు రూ.50 వేలు, 2వ జట్టుకు రూ.30 వేలు, 3వ జట్టుకు రూ. 20 వేలు అందిస్తున్నట్లు పోటీల నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్రీడాకారులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.