ఉరవకొండ: బెలుగుప్పలో ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
బెలుగుప్ప మండల కేంద్రంలో సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మధు, మహిళా మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యురాలు భవాని, కోశాధికారిణి కవిత లు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో మన ఊరు- మన జెండా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. జై బీజేపీ, జై నరేంద్ర మోడీ అంటూ నినాదాలు చేశారు.