గిద్దలూరు: కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో చెత్త సేకరించే రిక్షాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక రెడ్డి
మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం చెత్త సేకరించే రిక్షాలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తడి చెత్త పొడి చెత్త సేకరణకు చెత్త సేకరణ డబ్బాలను పారిశుద్ధ్య కార్మికులకు అందించారు. గ్రామాల పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గత ప్రభుత్వం చెత్త పై పన్ను వేస్తే తమ ప్రభుత్వం చెత్త నుంచి సంపద తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇచ్చిన వస్తువులతో గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.