రాయదుర్గం: భక్తిశ్రద్దలతో శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయం, విగ్రహ ప్రతిష్టాపన
రాయదుర్గం పట్టణంలోని కణేకల్లు రోడ్డులో కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయం, అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఈనెల 1 నుండి 3 వ తేదీ వరకూ వివిధ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నపూర్ణేశ్వరి స్థిరభింభ నూతన ఆలయం, విమానగోపురం కలశస్థాపన, మహా కుంభాభిషేకం, నాగదేవతల విగ్రహ ప్రతిష్టాపన శాస్త్రోక్తంగా వేదపండితులచే నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు నల్లపూల వెంకటేసులు, ముత్యాలంపల్లి అశోక్ తెలియజేశారు. గురువారం ఉదయం యజ్ఞ యాగాలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.