గిద్దలూరు: ఈనెల 27వ తేదీన గిద్దలూరులో పర్యటిస్తున్న సీఎం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఈనెల 27వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనను కార్యకర్తలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రెండు సంవత్సరాల తర్వాత సీఎం చంద్రబాబు మన నియోజకవర్గానికి వస్తున్నా నేపథ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆహ్వానించాలని తెలిపారు. విజయోత్సవ సభ తో పాటు సంజీవిని ఆసుపత్రులను సీఎం చంద్రబాబు ఆరోజు ప్రారంభిస్తారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు.