Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ వాఖ్యలకు నిరసనగా కోడిగుడ్లు కొట్టి ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగు మహిళలు

Rayadurg, Anantapur | Jun 16, 2026
దళిత వ్యతిరేకి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు బండి భారతి డిమాండ్ చేశారు. రాష్ట్ర హోంమంత్రి అనితపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాయదుర్గంలో టీడీపీ మహిళా, ఎస్సీ విభాగాల నాయకులు మంగళవారం సాయంత్రం అమర్నాథ్ చిత్రపటంపై కోడిగుడ్లు, టమోటాలు విసిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వైసీపీ నాయకులకు హితవు పలికారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ప్రశాంతి, సుమలత, బుళ్లారి జ్యోతి, పద్మజ, సీనియర్ నాయకురాలు సంపత్ కుమారి, కొలిమి మంజుల, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున పాల్గొన్నారు.