గిద్దలూరు: రాచర్ల మండలం సోమిదేవి పల్లి గ్రామంలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం సోమిరెడ్డిపల్లి గ్రామంలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకొని మంగళవారం రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు జరిగాయి. పోటీలలో స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోదరులు కృష్ణ కిషోర్ రెడ్డి ప్రారంభించారు. పోటీలలో విజయం సాధించే ఎడ్ల జతల యజమానులకు నగదు బహుమతులను అందజేస్తామని పోటీల నిర్వాహకులు తెలిపారు. అంతకుముందు ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.