యర్రగొండపాలెం: త్రిపురాంతకం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జోరుగా కొనసాగుతున్న వేసవి క్రికెట్ టోర్నమెంట్
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు వేసవి జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ బొందలపాటి చిన్న వెంకటస్వామి సారథ్యంలో నీలం ఇసాక్, చింతకుంట్ల రాజరావు, కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రసవత్తంగా జరుగుతున్నాయి. మొదటి బ్యాటింగ్ చేసిన చందవరం టీం 56 పరుగులు చేసింది. అనంతరం సైదా టీం 57 పరుగులు సాధింది విజయం సాధించింది. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ను కిట్టుకు చిన్న వెంకట స్వామి మరియు గొట్టిముక్కుల నాసరయ్య చేతుల మీదగా అందజేశారు.