దర్శి: వార్డుల పెంపుపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించిన దర్శి కమిషనర్ అర్జునరావు
Darsi, Prakasam | May 19, 2026 ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలోని వార్డుల సంఖ్య పెంపును ప్రభుత్వ ఆదేశాల మేరకు 20 నుంచి 28 వరకు పెంచుతున్నట్లు కమిషనర్ అర్జునరావు తెలిపారు. సంబంధిత సరిహద్దులు కలిగిన వార్డుల వివరాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వార్డుల పునర్విభజనకు సంబంధించిన అభ్యంతరాలు సూచనలు రాతపూర్వకంగా రాసి మే 24వ తేదీ లోపు తమకు సమర్పించాలని కోరారు.