కొండపి: టంగుటూరు మండలం ఎర్ర చర్ల గ్రామానికి చెందిన వృద్ధురాలు మృతి, ఈనెల 27న అదృశ్యమై మృతిచెందిన వృద్ధురాలు, పోలీసులు దర్యాప్తు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎర్రజర్ల గ్రామానికి చెందిన వృద్ధురాలు కమలమ్మ మృతి చెందిన సంఘటన శనివారం వెలుగు చూసింది. మతిస్థిమితం లేని కమలమ్మ ఈనెల 27వ తేదీన ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయినట్లుగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వృద్ధురాలిని వెతికే క్రమంలో కొణిజేడు సమీపంలో ఆమె మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. కమలమ్మ చనిపోయి 2 లేదా 3 రోజులు అయ్యి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు.