దర్శి: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించిన దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | May 22, 2026 ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ప్రజలకు సత్వర న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అధికారులు ప్రజల యొక్క అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రజలకు వివరించాలన్నారు.