యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో మాహత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి ఘన నివాళులర్పించిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కుల వివక్ష నిర్మూలన, పురుష స్త్రీ సమానత్వం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిబాపూలే అని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.