బడుగు బలహీన వర్గాల వారి భూములను తిరిగి వారికి ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని సీపీఎం పార్టీ కన్వీనర్ వడ్డేపల్లి చెంగయ్య వెల్లడించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బస్టాండ్ సెంటర్ నుండి తాసిల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ నరసింహారావుకు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి చంగయ్య 4 గంటల ప్రాంతంలో మాట్లాడుతూ... వెంకటగిరి మండల రూరల్ పరిధిలోని కలపాడు పంచాయతీ లోని సర్వేనెంబర్ 1,35, 36 లో ఉన్న 1500 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూమిని దళిత, గిరిజన, బలహీనవర్గాల పేదలకు పంచిపెట్టాలని, ఆ భూములపై పూర్తి హక్కులు కలి