దర్శి: దర్శి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఏబీఎన్ అధినేత రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ప్రకాశం జిల్లా దర్శి ముండ్లమూరు తాళ్లూరు పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులు ఏబీఎన్ ఛానల్ అధినేత రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వైసిపి నాయకులపై కుటుంబ సభ్యులపై అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు ఆరోపించారు. భవిష్యత్తులో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.