యర్రగొండపాలెం: దోర్నాల శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిలో చెరువును తలపిస్తున్న వర్షపు నీరు
మార్కాపురం జిల్లా దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి వర్షపు నీటితో చెరువును తలపిస్తుంది. సైడ్ కాలువలు లేకపోవడంతో నీరంతా రోడ్డుపైనే నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడినప్పుడల్లా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని స్థానిక ప్రజలు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి కాలువలు ఏర్పాటు చేయాలని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.