యర్రగొండపాలెం: దోర్నాల శ్రీశైలం మార్గంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపిన మార్కాపురం డిపో మేనేజర్ లావణ్య
మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం మార్గంలో శని ఆదివారాలలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు మార్కాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. ప్రయాణికులు రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రతి వారం 14 నుంచి 18 బస్సులు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. స్త్రీ శక్తి పథకం తర్వాత మహిళలు భక్తులు రద్దీ పెరగడంతో దోర్నాలలో ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.