తాడిపత్రి: మైనర్లు వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేయడంతో పాటు చర్యలు తీసుకుంటాం: యాడికి సిఐ శ్రీనివాసులు
మైనర్లు వాహనాలను నడిపితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు చర్యలు తీసుకుంటామని యాడికి సీఐ శ్రీనివాసులు హెచ్చరించారు. యాడికి లో శనివారం రాత్రి తిరిగి ఆదివారం పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాలు నడుపుతున్న 13 మంది మైనర్లను, వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇకమీదట మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులు పై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.