కొండపి: పాత సింగరాయకొండలో బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి, అనుమానస్పద మృతిక కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ సమీపంలోని ఓ బావిలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానస్పద మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే మృతదేహానికి బండరాయి కట్టి ఉండడాన్ని గమనించిన పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.