మార్కాపురం: జిల్లా నూతన ఇన్చార్జి డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా సుబ్బారావు నియామకం
మార్కాపురం జిల్లా నూతన డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా సామా సుబ్బారావు నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం ప్రకాశం జిల్లా మైనంపాడు గవర్నమెంట్ డైట్ కళాశాలలో సీనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. మార్కాపురం జిల్లా ఇన్చార్జి డీఈవోగా సుబ్బరావును నియమిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తమిమ్ అన్సరియా ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఈయన బాధ్యతలు స్వీకరించనున్నారు.