గిద్దలూరు: గిద్దలూరులో ఘనంగా మొహరం పండుగ వేడుకలు, నిప్పుల గుండంలో వేగంగా కాలిపోయిన భారీ మొద్దులు
మార్కాపురం జిల్లా గిద్దలూరులో ఘనంగా మొహరం పండుగ వేడుకలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకు ఖాదర్ వలీ పీర్ల ను భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారికి నైవేద్యం సమర్పించారు. పీర్ల చావిడి సమీపంలో ఏర్పాటుచేసిన అగ్నిగుండం భక్తులను విశేషంగా ఆకర్షించింది. భారీ మొద్దులు మంటలలో ఆవిరైపోయాయి. స్వామివారి మహత్యం తోనే ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుందని భక్తులు తెలిపారు.