గిద్దలూరు: గిద్దలూరు మండలం కొంగలవీడు ఎస్టి కాలనీలో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు, 34 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కొంగలవీడు ఎస్టి కాలనీలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలను సేకరించారు. ఇటీవల కొత్త వ్యక్తులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించి చోరీలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు సీఐ సురేష్ వెల్లడించారు. సరైన ధ్రువపత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నామని సీఐ అన్నారు. ఎవరన్నా అనుమానిత వ్యక్తులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ సురేష్ కోరారు.