కొండపి: కొండపి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండపిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి బుధవారం పరిశీలించారు. మరమ్మతులతో పాటు నూతన భవనాల నిర్మాణ పనులను పరిశీలించి పురోగతిని అధికారులతో అడిగి తెలుసుకున్నారు. వేగంగా పనులు పూర్తి చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు నియోజకవర్గ ప్రజలకు అందిస్తానని మంత్రి అన్నారు.