ప్రకాశం జిల్లా సంతనూతలపాడు రెవెన్యూ కార్యాలయాన్ని శనివారం MLA విజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయం పనితీరుపై డిప్యూటీ తహశీల్దార్ మాబు సుభానిని అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో ఎటువంటి పెండింగ్ లేకుండా పనులను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ASO శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.