మార్కాపురం జిల్లా గిద్దలూరు లో జూన్ 27వ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అదేరోజు దోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టును సందర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ వద్ద సీఎం పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను డీఎస్పీ నాగరాజు స్థానిక టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పరిశీలించారు.