యర్రగొండపాలెం: మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఘన నివాళులర్పించిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో మహానాడు కార్యక్రమం రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పట్టణ ప్రధాన కూడలిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. భారీ ఎత్తున టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మహానాడు సభా ప్రాంగణం నాయకులు కార్యకర్తలతో పసుపు మయంగా మారింది.