మార్కాపురం: గంజాయి రహిత మార్కాపురం గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
గంజాయి రహిత మార్కాపురం గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ... యువత గంజాయికి అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఎక్కడైనా గంజాయి విక్రయాలు జరుగుతున్న సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. అంతేకాకుండా పదివేల రూపాయల ప్రోత్సాహ బహుమతి ఉంటుందన్నారు. యువత సహకరించాలని కోరారు.