గిద్దలూరు: కంభం మండలం జంగం గుంట్ల వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఒక్కరు మృతి, మరో ఒకరికి తీవ్రగాయాలు
కంభం మండలం జంగంగుంట్ల గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న అర్ధవీడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన మల్లెల శ్రీనివాసరెడ్డి సంఘటన స్థలంలోని మృతి చెందాడు. ఇది చక్ర వాహనంపై ప్రయాణిస్తున్న హలీం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు ద్విచక్ర వాహరాన్ని ఢీకొట్టిన అనంతరం రోడ్డు పక్కనే ఉన్న పాడుబడ్డ పాత పంచాయతీ కార్యాలయాన్ని ఢీకొట్టింది.