కొండపి: గిట్టుబాటు ధర కల్పించాలని పొగాకు రైతులు కొండపి పొగాకు వేలం కేంద్రం వద్ద నిరసన, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు
పొగాకు కనిష్ఠ ధరను రూ.160కి తగ్గించడం, నోబిడ్స్ పెరిగిపోవడంతో ఆగ్రహించిన నేతివారిపాలెం గ్రామ రైతులు కొండపి పొగాకు బోర్డు వద్ద ధర్నాకు దిగి వేలాన్ని నిలిపివేశారు. సమాచారం అందుకున్న కొండపి ఎస్ఐ త్యాగరాజు సిబ్బందితో కలిసి వచ్చి రైతులతో చర్చలు జరిపారు. ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధర కల్పించే వరకు నిరసనలు ఆపేది లేదని రైతులు స్పష్టం చేశారు.