గిద్దలూరు: గిద్దలూరు మండలం ముండ్లపాడు లో తుమ్మ చెట్లు చోరీ జరిగిన ఘటనపై మీడియాకు వివరాలు వెల్లడించిన ఇరిగేషన్ శాఖ డి.ఈ రామారావు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో చెరువులో తుమ్మ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు యంత్రాల ద్వారా నరికి అపహరించి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఇరిగేషన్ శాఖ డీఈ రామారావు మీడియాకు వివరాలు వెల్లడించారు. విచారణ జరిపి తుమ్మ చెట్లు దొంగిలించిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.