కొండపి: మర్రిపూడి మండలం కెల్లంపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం, 20 లక్షల విలువచేసే మంటల్లో కాలిపోయిన పొగాకు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. కేల్లంపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీను నిలువ ఉంచిన పొగాకు గోడౌన్ లో మంటలు చెలరేగి.16 పొగాకు చెక్కలతోపాటు గోదాం కాలిపోయింది. దాదాపు రూ.20 లక్షలు ఆర్థికంగా నష్టపోయినట్లు బాధిత రైతు శ్రీను ఆవేదన వ్యక్తం చేస్తూ తెలిపాడు. అప్పు చేసి మరి పెట్టుబడి పెట్టానని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.