యర్రగొండపాలెం: దోర్నాల మండలం నల్లగుంట్ల గ్రామంలో ఓటర్ల జాబితా పై అప్రమత్తంగా ఉండాలని సూచించిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట్ల గ్రామంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పై టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు బిఎల్ఎల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా పై అప్రమత్తంగా ఉండాలన్నారు. బూతుల వారిగా బిఎల్ఓ లతో కలిసి సర్వే ప్రక్రియ పర్యవేక్షించాలి అన్నారు. అవసరమైన పత్రాలు జత చేసి బిఎల్ఓ లకు అందేలా చూడాలని సూచించారు.