మార్కాపురం: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో అలంకారప్రాయంగా ఉన్న ఆర్ఓ ప్లాంట్
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించడానికి గత ప్రభుత్వం నాడు నేడు వంటి పథకాల కింద ఆరో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అవి ప్రస్తుతం కొన్నిచోట్ల నేర్పయోగంగా మారాయి. మార్కాపురం జిల్లా కేంద్రంలోని పూల సుబ్బయ్య కాలనీ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ పనిచేయడం లేదు. మరమ్మతులకు గురికావడంతో కంప్లైంట్ చేశామని హెచ్ఎం తెలిపారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అలంకారప్రాయంగా ఆరో ప్లాంట్ దర్శనమిస్తుంది.