యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామంలో గురవయ్య అనే వ్యక్తి ఇంట్లో కలకలం రేపిన త్రాచుపాము
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామంలో నక్క గురువయ్య అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం త్రాచుపాము ప్రత్యక్షమైంది. పడగ విప్పి బుసలు కొట్టడంతో ప్రాణభయంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖలో స్నేక్ క్యాచర్ లేకపోవడంతో ఇటువంటి పరిస్థితులలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి స్నేక్ క్యాచర్ ను నియమించాలని ప్రజలు కోరారు