రాయదుర్గం: తిమ్మాలాపురంలో విషాదం, విద్యుత్ షాక్ కు గురై యువకుడు మృతి
డి.హిరేహాల్ మండలం తిమ్మాలాపురం గ్రామానికి చెందిన మల్లికార్జున విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు మల్లికార్జునకు ఏడాది క్రితం వివాహమైంది. భార్య ప్రసవం కోసం కర్ణాటకలోని పుట్టింటికి వెళ్లింది. బిడ్డను చూసి వచ్చిన మల్లికార్జున ఆదివారం స్వగ్రామానికి చేరుకున్నాడు. సోమవారం తల్లి, అన్న, వదినతో కలిసి పొలానికి వెళ్లి, మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లో టేబుల్ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయగానే ఫ్యాన్‌కు విద్యుత్ సరఫరా అయి షాక్ కొట్టడంతో అతను కుప్పకూలిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.