దర్శి: దర్శి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో పెండింగ్ వేతనాలు చెల్లించాలని సిపిడబ్ల్యూఎస్ స్కీం కాంట్రాక్ట్ కార్మికులు నిరసన
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో గత ఎనిమిది నెలలుగా వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ కాంట్రాక్టు కార్మికులు నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 8 నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.