గిద్దలూరు: వైసీపీని వీడి టిడిపిలో చేరిన రాచర్ల మండలం అనుములవీడు గ్రామానికి చెందిన 80 కుటుంబాలు, పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం అనుముల వేడు గ్రామానికి చెందిన 80 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలో చేరాయి. గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమక్షంలో వారు టిడిపి కండువా కప్పకున్నారు. నూతనంగా పార్టీలోకి చేరిన కార్యకర్తలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై వైసీపీ కార్యకర్తలు టిడిపిలో చేరినట్లు ఎమ్మెల్యే అన్నారు.