గిద్దలూరు: రాచర్లలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా దాచర్ల పట్టణంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే వెళ్లి ఎమ్మెల్యే పెన్షన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం యజ్ఞం గా చేస్తుంటే వైసీపీ మాత్రం రాక్షసుల అడ్డుపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశారని అన్నారు. మెగా డీఎస్సీ లో ఎటువంటి అవకతవకలు జరగకపోయినా వైసిపి అనవసరంగా బురద చల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.