గిద్దలూరు: రాచర్ల పెద్ద చెరువు సమీపంలో వీధి కుక్కలు చుక్కల దుప్పిపై దాడి, మృతి చెందిన చుక్కల దుప్పి జింక
మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని పెద్దచెరువు సమీపంలో చుక్కల దుప్పిని వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. నీటిని తాగేందుకు వచ్చిన క్రమంలో జింకపై కుక్కలు దాడి చేసి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు జింకని పరిశీలించి పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. నల్లమల్ల అటవీ ప్రాంతం అతి సమీపంలో ఉండడం వల్లే చుక్కలదొప్పి ఈ ప్రాంతంలోకి వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. స్పాట్ విజువల్స్..